lakshmi-vantillu

Aloo Keema Recipe in Telugu | కైమా బంగాళా దుంప కూర | Mutton Keema | Potato Keema | Non Veg Recipes

Aloo Keema Recipe in Telugu | కైమా బంగాళా దుంప కూర | Mutton Keema | Potato Keema | Non Veg Recipes Keema Potato Recipe non veg recipes in telugu lakshmi vantillu indian home food recipes mutton keema with potato Hai Friends… Welcome to lakshmi vantillu ఈ రోజు aloo keema ఎలా ప్రిపేర్ చెయ్యాలో చూద్దాం దీనికి కావలిసిన పధార్ధాలు మటన్ కైమా 200 గ్రాములు – బంగాళా దుంప 1 – టమాటో 1 – పెరుగు 2 tsp – అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp – ఉల్లిపాయ 1 – ఎండు మిర్చి 5 – పచ్చి మిర్చి 1 – ఉప్పు – పసుపు – గరం మసాలా ½ tsp – ధనియాల పొడి ½ tsp – జీల కర్ర పొడి ½ tsp – ఆయిల్ 3 tsp – అనాస పువ్వు 1 – దాల్చిన చెక్క 1 inch – మరాటి మొగ్గ 1 – కొత్తిమీర తయారీ విధానం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత ఎండు మిర్చి వేసి రంగుమారే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయి లో అనాస పువ్వు – దాల్చిన చెక్క – మరాటి మొగ్గ వేసి కొంచెం సేపు వేగిన తరువాత కట్ చేసిన ఉల్లిపాయ – 1 tsp ఉప్పు – కొద్దిగా పసుపు వేసి దోరగా వేయించండి . ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు కలపండి తరువాత కడిగి శుభ్రం చేసుకున్న కైమా వేసి ఐదు నిమషాల పాటు ఫ్రై చేసుకోండి దీనిలో గరం మసాలా – ధనియాల పొడి – జీల కర్ర పొడి – చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఫ్రై చేసిన ఎండు మిర్చి – కట్ చేసిన టమాటో – పెరుగు – తగినంత వాటర్ వేసి కలుపుకొని పదిహేను నిమషాల పాటు ఉడికించుకోండి కైమా ఉడికిన తరువాత కట్ చేసిన ఆలూ – మరి కొంచెం వాటర్ – చిన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసి మరో పది నిమషాలు మూత పెట్టి ఉంచండి ఒకసారి ఉప్పు సరి చూసుకొని తగినంత కలుపుకొండి కూర దగ్గరగా వచ్చిన తరువాత కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి

See also  Masala Brinjal Bajji | Vankaya Bajji Recipe In Telugu | Gopalapuram Vankaya Bajji Recipe | Snacks

ఈ కర్రీ ని మనం చపాతీ – రోటి – నాన్ తో పాటు రైస్ కూడా కలిపి తీసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి – మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం

#alookeema #recipe #telugu

hqdefault-4239048
Rated nan

Date Published 2021-01-04 08:06:22
Likes 0
Views 23
Duration 4:

Leave a Comment